Header Banner

ఏపీలో కొత్తగా మరో నేషనల్ హైవే..! ఈ రూట్‌లో రూ.809 కోట్లతో నాలుగ లైన్లుగా..!

  Mon May 05, 2025 12:37        Politics

ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పనుల పునఃప్రారంభంలో భాగంగా.. వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయడంతోపాటు జాతికి అంకితం చేశారు. వీటిలో ప్రధానంగా ఏడు జాతీయ రహదారులు (ఎన్‌హెచ్‌), రైల్వే పనుల శంకుస్థాపనలు చేయగా.. ఇప్పటికే పూర్తి చేసిన మరో తొమ్మిది ఎన్‌హెచ్, రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. వీటిలో కీలకమైనది.. హిందూపురం-గోరంట్ల మధ్య 34 కి.మీ. మేర రూ.809 కోట్లతో నాలుగు వరుసలుగా జాతీయ రహదారి విస్తరణ.. దీనికి ప్రధాన మోదీ శంకుస్థాపన చేశారు. ఇక ఈ హైవే పనులు శరవేగంగా సాగనున్నాయి. మరోవైపు కడప జిల్లాలోని ముద్దనూరు నుంచి పులివెందుల, కదిరి మీదుగా వెళ్ళే 42వ నేషనల్ హైవేను లింక్ చేస్తూ గోరంట్ల మీదుగా హిందూపురం దగ్గరలోని కొడికొండ - శిర జాతీయ రహదారి 544Eని అనుసంధానం చేస్తున్నారు. దాదాపు 150 కిలోమీటర్ల మేర నాలుగు లైన్ల రోడ్లను మూడు భాగాలుగా విభజించి నిర్మిస్తున్నారు.

ముద్దనూరు నుంచి బి.కొత్తపల్లి జంక్షన్ వరకు, అక్కడి నుంచి గోరంట్ల మండలం తిప్పరాజుపల్లి వరకు, ఆ తర్వాత హిందూపురం వరకు విభజించారు. కొత్తపల్లి నుంచి గోరంట్ల మధ్య 57 కిలోమీటర్ల మేర రూ.840 కోట్ల అంచనా వ్యయంతో పనులు వేగంగా జరుగుతున్నాయి. గోరంట్ల నుండి ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా ఏదో ఒక జాతీయ రహదారి మీదుగానే వెళ్ళే అవకాశం ఉంది. దీనితో రవాణా పరంగా గోరంట్ల జిల్లాలోనే ముఖ్య కేంద్రంగా మారుతుంది. దీనికి తోడు బెంగళూరుతో పాటు అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఇక్కడికి దగ్గరలోనే ఉండటం కలిసొచ్చే అంశం అంటున్నారు. శ్రీసత్యసాయి జిల్లాకు తలమానికంగా నిలుస్తున్న బెంగళూరు - అమరావతి మధ్య రూ.19,320 కోట్ల అంచనాలతో 14 ప్యాకేజీలుగా ఆరు వరుసల రహదారిని నిర్మిస్తున్నారు. 'బెంగళూరు నుంచి కోడూరు వరకు 73 కిలోమీటర్లు, అద్దంకి నుంచి విజయవాడ వరకు 113 కిలోమీటర్లు బ్రౌన్‌ఫీల్డ్‌గా (ఇదివరకే వినియోగంలో ఉండటం) ఎంపిక చేశారు'. కోడూరు నుంచి అద్దంకి వరకు 343 కిలోమీటర్లు గ్రీన్‌ఫీల్డ్‌గా విభజించారు. మొత్తం మీదే ఏపీలో నేషనల్ హైవేల పనులు స్పీడందుకున్నాయి.. కేంద్రం సహకారంతో ముందుకు సాగుతున్నాయి.

ఇది కూడా చదవండి: ఆ నామినేటెడ్ పదవుల భర్తీకి డేట్ ఫిక్స్! ఎప్పుడంటే!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

షాకింగ్ న్యూస్: జగన్ హెలికాప్టర్ ఘటన దర్యాప్తు వేగవంతం! 10 మంది వైసీపీ కార్యకర్తల అరెస్ట్!

 

నెల్లూరు రూరల్ అభివృద్ధి అద్భుతం.. 60 రోజుల్లోనే 339 అభివృద్ధి పనులు పూర్తి! మంత్రి ప్రశంసలు

 

పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. జాతీయ సాంస్కృతోత్సవ పురస్కార వేడుక!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

అడ్డంగా బుక్కైన ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?

 

జైలులో మాజీమంత్రి ఆరోగ్య పరిస్థితి విషమం! ఆసుపత్రికి తరలింపు..!

 

ఏపీ ప్రజలకు శుభవార్త! రూ.3,716 కోట్లతో.. ఆ రూట్లో ఆరు లైన్లుగా నేషనల్ హైవే!

 

సంచలన నిర్ణయం తీసుకున్న OYO హోటల్స్.. మరో కొత్త కాన్సెప్ట్‌తో - ఇక వారికి పండగే..

 

నిరుద్యోగులకు శుభవార్త.. నెలకు రూ.60 వేల జీతం.. దరఖాస్తుకు మే 13 చివరి తేదీ!

 

ఇక బతకలేను.. నా చావుకు కారణం వాళ్లే! ఢీ ఫేమ్ జాను కన్నీటి వీడియోతో కలకలం!

 

ఏపీలో చిన్నారులకు తీపికబురు - 18 ఏళ్ల వరకు ప్రతి నెలా రూ.వేలు! ఈ పథకం గురించి తెలుసాదరఖాస్తు చేస్కోండి!

 

నేడు (5/5) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #AndhraPradesh #NationalHighway #InfrastructureBoost #RoadDevelopment #HighwayExpansion #ModiInAP